బాల కృష్ణుని వేష౦

The Sunny Spring
Singapore
May - 2006


నేను నడక నేర్చుకుంటున్నక్రొత్తల్లో మా నాన్న, సుధా పెద్దమ్మ నాకు సుదీప్తి అక్కకి బాల కృష్ణుని లా వేష౦ వేసారు. మా నాన్న కాస్ట్యూమ్స్ కి కావలసిన పూసలు కొనుక్కుని వచ్చారు. సుధా పెద్దమ్మేమో వాటిని ఆభరణాలు లాగ తాయారు చేసారు. పుట్టిన రోజు నాడు అమ్మాయిలకి పెట్టే కిరీటం కి మార్పులు చేర్పులు చేసి దానికి నెమలి పింఛం పెట్టారు.
అన్నట్లు నెమలి పింఛం చక్రి పెన్నా ఇండియా నుంచి తీసుకు వచ్చారు. ప్లూట్ ని ఎలా తయారు చేసారంటే మందపాటి పేపర్ తో చేసి దాని చివర ఒక పోగు గుచ్చారు. ప్లూట్ తయారు చేసేటప్పుడు నేను చూడలేదు అందుకని నాకు వేష౦ వేసి ప్లూట్ చేతికి ఇచ్చినపుడు ఉదుదామని నోట్లోపెట్టుకున్నాను. అది తడిసి ముద్ద ముద్ద అయింది. ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియో పెట్టాను తప్పక చూడండి.

కమ్యూనికేషన్ గ్యాప్

హలో దేర్,

మా అమ్మ ఈ రోజు నాకు ఫోన్ చేసింది. నేను ఇండియా లో ఉన్నాను మా తమ్ముడేమో సింగపూర్ లో మా నాన్న వాళ్ల దగ్గర ఉన్నాడు కదా. మా తమ్ముడు ఇంకా పాకటం లేదంట. రెండు చేతులు రెండు కాళ్ళు పైకి లేపి పొట్ట మీద నిలబడి పాకాలని చూస్తున్నాడట. చూసారు కదా ప్రక్కన ఉన్నఫోటో. నేను అక్కడ ఉన్నట్లయితే ఎంచక్కా పాకటం నేర్పి౦చేవాడినో. తమ్ముడు చిన్న పిల్లోడు కదా మనమే పాకి ఇలా అని చూపించాలి అంటే demonstration ఇవ్వాలి అన్నమాట. లేదంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది. కమ్యూనికేషన్ గాప్. మా నాన్న డెమో ఇవ్వటానికి ట్రై చేశారట కాని నడుము పట్టేసింది అని అమ్మ చెప్పింది. అదే అక్కడ నేను ఉన్నట్లయితే ఎంచక్కా డెమో ఇచ్చేవాడిని కదా?


సరేలే మా తమ్ముడు పాకటానికి పడే కష్టాలు వీడియో తీసి ఈ బ్లాగ్ లో పెట్టారు మా నాన్న తప్పకుండా చూడండి.